యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీనివాస కళ్యాణం’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. శతమానం భవతి చిత్రంతో అదిరిపోయే హిట్ కొట్టిన సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న శ్రీనివాస కళ్యాణం కూడా మొదటి నుండి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతూ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్, ఆడియో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక మంచి విందు భోజనంలా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఈ చిత్రంలో ఉన్నాయనే సంగతి మనకు ఈ ట్రైలర్ చూస్తే ఇట్టే అర్ధం అవుతోంది. పెళ్లి.. దాని ప్రాముఖ్యత గురించి ఈ సినిమా మనకు ఎలాంటి మెసేజ్ ఇస్తుందా అనేది మూవీ చూసిన తరువాత చెప్పగలం. ఇక ఈ ట్రైలర్ మొత్తం చాలా కలర్‌ఫుల్‌గా కనిపించింది. ముఖ్యంగా ఇందులోని డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న మ్యూజిక్ ట్రైలర్‌ను మరింత కలర్‌ఫుల్ చేసింది. ఈ సినిమాపై నితిన్ అయితే చాలా నమ్మకం పెట్టుకున్నాడు. నితిన్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
ఫ్యామిలీ ఆడియెన్స్ ఎలాంటి అంశాలు ఆశిస్తారో అవి ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయి. మరి ఈ ‘శ్రీనివాస కళ్యాణం’కు ప్రేక్షకులు ఎలాంటి విజయాన్ని అందిస్తారో తెలియాలంటే మాత్రం ఆగష్టు 9 వరకు ఆగాల్సిందే.