టాలీవుడ్ ,కోలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ నిత్యమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి. తన నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ ఉంటుంది నిత్యమీనన్. మలయాళం లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె హీరోయిన్గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నటించింది. అలా మొదలయ్యింది అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ సమయంలో నిత్య మీనానికి అసలు తెలుగే రాదట.
ముఖ్యంగా నిత్యామీనన్ చెప్పే డైలాగులు ఎంతోమంది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాలా ఉంటాయి. ఇప్పటికి నిత్యామీనన్ కెరియర్ అలాగే కొనసాగుతోంది. ఇప్పటికే నిత్యమీనన్ అన్ని ప్రాంతీయ భాషలలో కూడా నటించింది. అయితే ఎక్కడ ఎదురుకాని పరిస్థితులు తమిళ ఇండస్ట్రీ నుంచి ఎదురైందని వార్తలు వినిపిస్తున్నాయి. నిత్య మీనన్ ను ఒక స్టార్ హీరో చాలా లైంగికంగా టార్చర్ చేశారంటూ చెప్పుకొచ్చింది. తమిళ ఇండస్ట్రీలో పని చేస్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు చాలానే ఎదురయ్యాయి అంటూ తెలుపుకొచ్చింది.
ఇప్పటివరకు నిత్యమైన తమిళంలో విజయ్, ధనుష్, దుల్కర్ సల్మాన్, విక్రమ్, సూర్య వంటి హీరోల చిత్రాలలో కూడా నటించింది. ఇందులో ఏ హీరో ఈమెతో అసభ్యకరంగా ప్రవర్తించారనే విషయం పైన అభిమానులు, నేటిజన్ సైతం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె ధనుష్తో 50వ సినిమాలో నటిస్తోంది. చివరిగా ఈమె టాలీవుడ్ సినిమాలో కనిపించిన చిత్రం భీమ్లా నాయక్. ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం నిత్యామీనన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.