‘శ్రీనివాస కళ్యాణం’ టీజర్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్, రాశి ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’, దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. వేగ్నేశ ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేస్తున్నారు. సుమారు 15 సంవత్సరాల తరువాత దిల్ రాజు, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే. ఆగష్టు 9 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ పై ప్రత్యక శ్రద్ధ చూపిస్తుంది. ఇవాళ విన్నూత్నంగా చిత్ర టీజర్ ని విడుదల చేసారు.
సినిమా ఆధ్యంతం కుటుంబా విలువల పై ఉండనుందని టీజర్ ద్వారా తెలుస్తుంది. ప్రతి మనిషి జీవితం లో ఆనందంగా ఉండేది ఒక్క పెళ్లి లో మాత్రమే అని టీజర్ లో చెప్పారు. ఇక ఈ సినిమా ఆడియో వేడుకని ఈ నెల 22 న నిర్వహించనున్నారు.

Share.