నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకులో ఉద్యోగాలు..367 పోస్టులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిరుద్యోగులు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నారు. ఇక గవర్నర్ మెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వాళ్లు కూడా చాలామంది. అలాంటి వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా 376 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పోస్టులకు కేవలం డిగ్రీ అర్హత తోనే భర్తీ చేయనుంది.

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ విభాగం కింద ఉద్యోగాలను భర్తీకి దరఖాస్తు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 376 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఇందులోనే రిలేషన్షిప్ మేనేజర్లు 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు.. నిర్దిష్ట అనుభవం కలిగి ఉండాలి.

అభ్యర్థుల వయస్సు విషయానికొస్తే..01-11-2021 నాటికి 28 నుంచి 35 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. కేవలం షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఇతర పద్ధతుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఇది ఒక చక్కటి అవకాశం లాంటిది అని చెప్పవచ్చు.

Share.