బాలీవుడ్ నటి నికిత దత్త సెల్ ఫోను ఆ మధ్య కొందరు దుండగులు లాక్కెళ్లి విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పటి నుంచి తన ఫోన్ తిరిగి లభించలేదని తెలిపింది నికిత. తాజాగా నిఖిత ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే నికిత మాట్లాడుతూ..ఆ రోజు జరిగిన ఘటన నిజంగా భయంకరం. నాకు ఫోన్ దొరుకుతుందన్న నమ్మకం కూడా పోయింది. ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే కూడా భయంగా ఉంది.
కానీ సాధారణంగా వాకింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ధైర్యం చేసి నేను ఇప్పట్లో బయటికి వెళ్ళలేను. అలా వెళ్లడం కూడా మంచిదని కూడా అనిపించలేదు నికితా చెప్పుకొచ్చింది. దీనిని ఒక పీడకల మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే మీరు కూడా రోడ్డు మీద ఉన్నప్పుడు చాటింగ్ మెసేజ్ లు లాంటివి చేస్తూ మునిగిపో వద్దు అంటూ సలహా ఇచ్చింది. ఆ ఘటన జరిగిన రోజు చ అసలు నిద్రపోలేదని ఆమె తెలిపింది.