ముద్ర చెరిపేసిన అర్జున్ సురవరం

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ హీరో నిఖిల్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వరుస సెక్సెస్‌లు సాధిస్తున్నాడు. స్వామి రారా, కార్తికేయ, కేశవ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ కుర్ర హీరో ప్రస్తుతం నటిస్తున్న చిత్రంపై ఇప్పటికే వివాదం చెలరేగింది. తొలుత ముద్ర అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను క్రియేట్ చేయడలంలో సక్సె్స్ అయ్యింది. కాగా ఇదే టైటిల్‌తో మరో సినిమా రిలీజ్ కావడంతో నిఖిల్ సినిమా అనుకుని ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది.

ముద్ర అనే టైటిల్‌తో రిలీజ్ అయిన సినిమా తనది కాదని నిఖిల్ క్లారిటీ కూడా ఇచ్చాడు. కాగా ఇప్పుడు తాజాగా తన సినిమా పేరును ‘అర్జున్ సురవరం’ అంటూ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు నిఖిల్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రెస్ రిపోర్టర్‌గా నిఖిల్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు మనకు పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది.

మార్చి 8న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అర్జున్ సురవరం ఎలాంటి సక్సె్స్‌ను సొంతం చేసుకుంటాడో చూడాలి. నిఖిల్ ఈ సినిమాతో మరో హిట్ అందుకోవడం ఖాయం అని అతడి ఫ్యాన్స్ అంటున్నారు.

Share.