టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఎంత గౌరవం ఉందో చెప్పనవసరం లేదు. చిరంజీవి ,పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో బాగానే రాణిస్తున్నారు.అయితే నాగబాబు మాత్రం కొన్ని సినిమాలలో హీరోగా నటించి అవి సెట్టుకాక ప్రొడ్యూసర్ గా పలు సినిమాలు చేశాడు. అయితే వారి ఇంటి నుంచి హీరోలు వచ్చారు కానీ హీరోయిన్ గా మాత్రం నిహారికనే వచ్చింది. కానీ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది.
ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్య తో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహమైన కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త బయటకు వచ్చింది. కానీ అది కన్ఫామా అనేది అంతకుముందు తెలియదు.. కానీ నిహారిక, చైతన్య ఇద్దరు సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలు డిలీట్ చేసి ఒకరినొకరు ఆన్ ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా వరుణ్ తేజ్ నిశ్చితార్థం లో కూడా ఎక్కడా వారిద్దరూ కలిసి కనిపించలేదు. ఇవి చూసిన నేటిజెన్లు కన్ఫామ్ గా నిహారిక విడాకులు తీసుకుంటోందని భావించారు.
నేటిజెన్లు అనుకున్నట్టుగానే ఆమె విడాకులు తీసుకుంది. ఆ తరువాత వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గా మారిపోయింది. అంతేకాకుండా ఈ మధ్యనే నిహారిక పింక్ ప్రొడక్షన్స్ హౌస్ నీ హైదరాబాదులో ప్రారంభించింది. అయితే ఇవన్నీ కాస్త పక్కన పెడితే నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతోందని ఆమె చేసుకోబోయేది ఎవరినో కాదు యూట్యూబ్ లో జిగిడి దోస్త్ అయినా క్లోజ్ గా ఉండే ఒక వ్యక్తితోనే రెండో పెళ్లి జరగబోతోందని అంతేకాకుండా దానికి సంబంధించిన సన్నాహాలన్నీ సిద్ధమయ్యాయని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది విన్న మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఇతని వల్లే వీరిద్దరూ విడిపోయారు ఏమో అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి అయితే నిహారిక రెండో పెళ్లి చేసుకోవటం ఖాయం అంటున్నారు పలువురు నేటిజన్స్.. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరస్ గా మారుతోంది.