ఆ కారణంతో సినిమాలకు దూరంగా ఉన్నాను :నిహారిక

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా డాటర్ నిహారిక గురించి మనందరికీ తెలిసిందే. యాంకర్ గా, హీరోయిన్ గా,అల్లరితో ఎంతో మంది ప్రేక్షకులను మనసులలో స్థానం సంపాదించుకుంది. అలాగే నిర్మాతగా కూడా తన సత్తా చాటుతోంది నిహారిక. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నిహారిక పలు విషయాలను పంచుకుంది. యాక్టర్ గా తనకు తన పెదనాన్న చిరంజీవి గారే స్ఫూర్తి అని తెలిపింది. ఇక పెళ్లి తర్వాత తన సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ.. తన భర్త చైతన్యకు సినిమాలో తాను నటించడం ఇష్టం లేదని అందుకే సినిమాలు చేయడం లేదని చెప్పుకొచ్చింది.

సినిమాలు కాకుండా ఏదైనా చేద్దామని టీచర్ ఫర్ ఇండియా అనే కార్యక్రమంలో పిల్లలకు పాఠాలు కూడా నేర్పాను అని చెప్పుకొచ్చింది.అయినప్పటికీ మూవీస్‌పై ఇష్టంతో ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశానని చెప్పుకొచ్చింది. ముద్దపప్పు ఆవకాయ్‌, నాన్నకూచీలతో పాటు యంగ్‌స్టర్స్‌తో కలిసి స్నేహంపై ఓ వెబ్‌సిరీస్‌ తీశానన్న నిహారిక ఇటీవలే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.కేవలం ప్రొడక్షన్ మాత్రమే కాకుండా యూట్యూబర్‌ నిఖిల్‌తో కలిసి ఓ సూపర్‌ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నానన్న ఆమె దానికి సంబంధించిన వివరాలను మాత్రం తెలుపలేదు.

Share.