ఆ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన నిహారిక..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ఇంటి కూతుర్లలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక మాత్రమే అన్న సంగతి అందరికి తెలిసిందే..అయితే నిహారిక మొదట్లో యాంకర్ గా రాణించి ఆ తర్వాత ఒక షార్ట్ ఫిలిం లో నటించి ఆ తరువాత నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు సినిమాతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. అయితే నిహారిక కి హీరోయిన్ గా అంత మంచి గుర్తింపు రాలేదు. హీరోయిన్ గా అచ్చుబాటు రాకపోవటంతో పెళ్లయ్యాక నిర్మాతగా రానిద్దాం అనుకుంది.

Niharika konidela in a banarasi silk saree at Varun and lavanya engament! |  Fashionworldhub

ఇక ఈ మధ్యనే నిహారిక తన భర్తతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. ఆ తరువాత ఈ ఏడాదిలోనే డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇదంతా కాస్త పక్కన పెడితే తెలుగు ప్రేక్షకులకు మెగా ఫ్యామిలీ నుంచి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే నిహారిక రెండో పెళ్లి విషయం పై నాగబాబు తన కూతురి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెండో పెళ్లి చేయాలని చూస్తున్నాడట.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ఏంటంటే విడాకులై ఇంట్లో నిహారిక ఉంటే వాళ్ల అన్న వరుణ్ తేజ్ కి పెళ్లి చేస్తే పదిమంది పలు రకాలుగా అనుకుంటారని నాగబాబు ఉద్దేశిస్తూ నిహారిక కి రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట .మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే వరుణ్ తేజ్ పెళ్లిలోనే నిహారిక కూడా రెండో పెళ్లి చేయాలని నాగబాబు చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి

అంతేకాకుండా ఇప్పటికే నిహారిక అబ్బాయిని కూడా సెట్ చేశారని ఆ అబ్బాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కాదని ఆ అబ్బాయి తండ్రి నాగబాబుకి మంచి ఫ్రెండ్ అని.. ప్రముఖ బిజినెస్ మాన్ అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారుతోంది.. ఈ విషయం ఎంతవరకు నిజమో అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

Share.