Nhiharika..తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ గా వినిపిస్తున్న పేర్లు నిహారిక (Nhiharika)తన భర్త చైతన్య.. నిహారిక మొదటినుంచి ఎందుకో సోషల్ మీడియాలో పెద్దగా జనాలకు టార్గెట్ అవుతూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు.. మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక హీరోయిన్గా పేరుపొందింది నిహారిక.. ఆ కారణంగానే జనాలు చీటికి మాటికి ఈమె పైన ట్రోల్ చేస్తూ విసిగించేలా చేస్తున్నారు. రీసెంట్గా నిహారిక విడాకులు తీసుకోబోతోంది అంటే ఒక న్యూస్ కూడా వైరల్ గా మారుతోంది..
దాదాపుగా 15 రోజులకు పైగా ఈ విషయంపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటివరకు ఈ విషయంపై మెగా ఫ్యామిలీ కానీ జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కానీ ఏ విధంగా స్పందించలేదు. కానీ నిహారిక సైతం ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేవలం సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్ట్‌లను షేర్ చేస్తూనే ఉంది.. ఈ క్రమంలోనే రీసెంట్గా జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ నిహారిక విషయంలో కాస్త వెనక్కు తగ్గారని చిరంజీవి పెద్దమనుషుల సమక్షంలో నిహారిక, చైతన్య మధ్య గొడవలను సర్దు మునిగేలా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా చైతన్యకు, నిహారిక అంటే ఇష్టమే కానీ ఆమె ఫ్రెండ్షిప్ ఆమె ఫ్రెండ్స్ హద్దులు మీరుతూ ఉండడంతో నిహారికను కంట్రోల్లో పెట్టాలని ఇలా చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో నిహారిక ఉండడం వాళ్లకి అసలు ఇష్టం లేదని.. చిరంజీవి కూడా ఇకమీదట నిహారిక ఇండస్ట్రీలో కనిపించదు అంటూ హెచ్చరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం నిహారిక అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరని చెప్పవచ్చు.
దీంతో చైతన్య ఫ్యాన్స్ మాత్రం చైతన్య లాంటి మంచి భర్త తనకి దొరకరని.. నిహారిక అంటే ప్రాణం ఇస్తారని ఇకనైనా పట్టింపులు మాని ఇద్దరు హ్యాపీగా ఉండండి అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.. ఈ విషయంపై మరి ఎప్పుడు వీరిద్దరూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నిహారిక సినిమాలలో సక్సెస్ కాలేకపోవడంతో పాటు ఇటు నిజ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉంటోంది.