Nhiharika..కొణిదెల నాగబాబు కూతురు నిహారిక(Nhiharika )ప్రతి ఒక్కరికి సుపరిచిత మే.. ఈ మధ్యకాలంలో తరచూ ఈమె గురించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదట టీవీ యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ అమ్మడు పలు చిత్రాలలో వెబ్ సిరీస్లలో కూడా నటించింది. మొదట ఒక మనసు చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ తరువాత పలు చిత్రాలలో కూడా నటించింది. తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నిహారిక బాగానే పాపులారిటీ సంపాదించింది.
నిహారిక సినిమాలో హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా తన టాలెంట్ ను ప్రూఫ్ చేసుకుంది. 2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది ప్రేమించి మరి ఈ వివాహం చేసుకుంది వీరు పెళ్లి కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరి పెళ్లి అయినా ఏడాదిన్నర తర్వాత నుంచి వీరిద్దరి మధ్య పలు మనస్పర్ధలు వచ్చాయని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై గడిచిన కొన్ని నెలల క్రితం క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి
తాజాగా నిహారిక రెడ్ కలర్ శారీలో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. పలువురు అభిమానులు, నేటిజెన్లు సైతం ఈ ఫోటోలను చూసి చాలా అందంగా ఉన్నావు అదిరిపోయావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఐ లవ్ యు నిహారిక బంగారం అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక గతంలో ఒకసారి పబ్బులో చిక్కి అత్తింటి పరువు తీస్తోంది అంటూ పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేశారు. ఈ విషయాలను తట్టుకోలేక ఇమే సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పింది. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో అడుగుపెట్టి తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది నిహారిక..