కరోనా వైరస్ కారణంగా సినీ రంగానికి కోలుకొని ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఒక పక్క షూటింగ్ లు లేవు. మరో పక్క థియేటర్లు మూత పడటంతో ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కరువయింది అనే చెప్పాలి. దీన్ని అదునుగా తీసుకుని ఓటిటీ ల ద్వారా సినిమాలు ప్రసారం చేస్తున్నారు. ప్రజలు కూడా ఓటిటిలో సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయారు.ఈ క్రమంలో బుల్లితెర ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 5 ను కూడా ఓటిటిలో ప్రసారం చేయాలనీ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షో సెప్టెంబర్ 5న గ్రాండ్ గా ప్రారంభంకానుంది.
ప్రస్తుతం హాట్‌స్టార్ తెలుగు బిగ్ బాస్ టీవీ వెర్షన్‌ను ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఈ షో ను బిగ్ బాస్ మేకర్స్ OTT ప్లాట్‌ఫారమ్ పై కూడా లో టెలీకాస్ట్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారట. మరి ఏ ఓటిటీ ఫ్లాట్ ఫార్మ్ ప్రసారం చేస్తుందనే విషయం ఇంకా తెలియలేదు.అయితే ఈ ఓటీటీ వెర్షన్ లో బిగ్ బాస్ షో నిరంతరాయంగా అంటే 24 గంటల పాటు ప్రసారం అవ్వనుందట.