టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. మొదట బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చింది. తెలుగు తోపాటు తమిళ్ ,మలయాళం వంటి భాషలలో కూడా పరిశ్రమలలో నటించింది. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే కొంతకాలంగా రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టాయని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఇమే భారతీయుడు-2 సినిమాలో నటిస్తున్నది.
బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది తాజాగా రకుల్ ప్రీతిసింగ్ చేసిన కామెంట్లు నేటిజన్లను ఫైర్ అయ్యే విధంగా చేస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ దేశంలోనే టాప్ పొజిషన్లో ఉందని తెలియజేస్తోంది. దీంతో ప్రేక్షకులు బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు బాగుంటాయని ప్రశంసలు కురిపిస్తున్నారు .అయితే రకుల్ ప్రీతిసింగ్ మాత్రం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని కూడా అందరూ భూతద్దంలోనే చూస్తూ ఉంటారని తెలియజేస్తోంది.
బాలీవుడ్, సౌత్ సినిమాలు రెండు ఒకటే అంటూ వాక్యానించింది. ఈ రెండింటిని వేరు వేరుగా చూడవద్దని దేశంలో ప్రతిబి గల దర్శకులు చాలామందే ఉన్నారని వాళ్లు మంచి సినిమాలు చేయడం మనకే గర్వకారణం అంటూ తెలియజేసింది.కానీ రకుల్ పై నేటిజెన్లు మండిపడుతున్నారు. బాలీవుడ్ సినిమాలను సౌత్ తో పోల్చడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా నీకు సౌత్ సినిమాలతోనే గుర్తింపు వచ్చింది అనే విషయాన్ని మర్చిపోవద్దు రకుల్ అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.