గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తుంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఎప్పటికప్పుడు ఈ వార్తలపై లావణ్య త్రిపాఠి ఖండించే ప్రయత్నం చేసింది. కానీ తాజాగా వరుణ్ పై తనకున్న ప్రేమను వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. వాస్తవానికి వీరిద్దరి మధ్య లవ్ ఉంది అని ఎంగేజ్మెంట్ కూడా రహస్యంగా చేసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది. త్వరలోనే పెళ్లి ప్రకటన రాబోతోంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు వీరిద్దరూ ఒకటి రెండు పార్టీలలో కలిసి పాల్గొన్నారు.
నిహారిక పెళ్లిలో కూడా లావణ్య త్రిపాటి తెగ సందడి చేసింది. దీనితో వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడుపుతోంది అని ఎఫైర్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇందులో నిజం లేదని.. ఒట్టి పుకార్లు అని చెప్పినా కూడా ఇప్పుడు మరొకసారి తన ప్రేమను వెల్లడించింది లావణ్య త్రిపాఠి.. లావణ్య త్రిపాఠి తాజాగా పులిమేక అనే చిత్రంలో నటించింది. బిగ్బాస్ సిరి కూడా ఇందులో నటించింది. ఈ టీం సుమ యాంకర్ గా చేస్తున్న సుమ అడ్డ షోలో తాజాగా పాల్గొన్నారు.. వీరితో సుమ గేములు ఆడిస్తూ.. ప్రశ్నలు సంధిస్తూ .. ఆడియన్స్ తో డైలాగులు చెప్పిస్తూ ఆద్యంతం నవ్వులు పూయించింది.. ఒక కుర్రాడు లావణ్య త్రిపాఠి లాంటి అమ్మాయి కావాలని చెప్పాడు .. అయితే కన్యాశుల్కం ఇవ్వాలని సుమా అనగా.. నా జీవితాన్నే ఇచ్చేస్తా అని చెప్పడంతో లావణ్య త్రిపాఠి సైతం ఫిదా అయింది.
ఆ తర్వాత యాంకర్ సుమ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరని లావణ్య త్రిపాఠిని అడగగా.. దీనికి లావణ్య వెంటనే రియాక్ట్ అవుతూ వరుణ్ తేజ్ పేరు చెప్పింది. వరుణ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అని తన మనసులో మాటను చెప్పింది.. ఇలా వరుణ్ పై తనకున్న ప్రేమను ఈ రూపంలో వెల్లడించింది అంటూ నేటిజన్లు చెబుతున్నారు.. అంతేకాదు మరోపక్క పెళ్ళెప్పుడు అని కూడా అడుగుతున్నారు.