సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది .ఇలా మొదటిసారి తెలుగులో నటించి మంచి అవకాశాలను అందుకున్నా ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా ప్రస్తుతం నాని సరసన ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక గతంలో మృణాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రేమించే వ్యక్తి కానీ, భర్త విషయంలో కానీ అందాన్ని చూడనని కేవలం వ్యక్తిత్వాన్ని మాత్రమే చూస్తానని తెలియజేసింది.
అయితే ఆ సమయంలో అందరూ కూడా ఈమె పైన మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా కపిల్ శర్మ షోలో వాటికి పూర్తి విరుద్ధంగా కామెంట్లు చేయడం జరిగింది. పెళ్లి చేసుకునే భర్త విషయంలో కచ్చితంగా తను ముందుగా అందాన్ని చూస్తానంటు తెలియజేసిందిదీంతో ఇప్పుడు ఇమే రెండు కామెంట్లను కలిపి సోషల్ మీడియాలో నెటిజెన్లు పలు రకాలుగా ట్రోల్ చేస్తున్నారు.. మరి కొంతమంది మృణాల్ వంచనకి మారుపేరు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అలా ఇంత తక్కువ సమయంలోనే ఇలా నిర్ణయాలు మార్చుకుంటే ఎలా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఇక పలువురు నెటిజన్ల ట్రోలింగ్ కామెంట్లు శృతిమించడంతో మృణాల్ బాగా హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. తన పైన కామెంట్స్ చేసేవారు సెలబ్రిటీలు కూడా సామాన్య మనుషులే అనే విషయాన్ని గుర్తించుకోవాలి అంటూ కౌంటర్ వేసింది. మాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయని చెప్పే సందర్భాన్ని బట్టి వ్యక్తిత్వం చేసే భావన బట్టి మారుతుందేమో కానీ నిర్ణయాలు మారవని మృణాల్ నెటిజన్లను ఉద్దేశించి విమర్శలు చేసింది.