ఆర్ఆర్ఆర్ లో ఐటమ్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం?

Google+ Pinterest LinkedIn Tumblr +

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయినా పోస్టర్స్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుందా ఉండదా చాలామందికి డౌట్ గా ఉంది. అయితే తాజాగా ఈ విషయంపై ఒక నెటిజన్ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ప్రశ్నించాడు.

ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందా మావా అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన చిత్రబృందం ఏ నువ్వు చేస్తావా అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ చేసి మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Share.