ఈమధ్య సోషల్ మీడియాలో హీరోయిన్స్ ని ట్రోల్ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే కొందరు హీరోయిన్లు చూసి వీటిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటున్నారు. కానీ హద్దు మీరితే మాత్రం చాలా స్ట్రాంగ్ కౌంటర్ లు ఇస్తుంటారు. అయితే తాజాగా రష్మికా కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఇప్పుడు. రష్మిక ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ లో మాట్లాడుతూ”సామీ సామీ పాట కోసం చాలా కష్ట పడ్డాను.. అది చూశాక అందరూ నన్ను ప్రశంసిస్తే చాలు.. డైరెక్టర్స్ ఏం చెబితే అదే నేను చేస్తా అంటూ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
అయితే ఈ విషయంపై ఒక నెటిజన్ మాత్రం.. రష్మిక ని పుష్ప సినిమాలో ఎందుకు హీరోయిన్ గా తీసుకున్నారు.. ఆమెను హీరోయిన్ గా తీసుకోకుండా ఉండాల్సింది.. ఆమె బ్యాటింగ్ చేస్తుంటే చూడలేక చస్తున్నాం అంటూ కామెంట్ చేశారు. అయితే దీనిపై రష్మికా స్పందిస్తూ.. యాక్టింగో, ఓవర్ యాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను.. నువ్వేం సాధించావు నాన్నా అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఆ నెటిజన్ కు ఇచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారుతోంది.