నెత్తుటి మరకలతో.. బింబిసార టీజర్ విడుదల..?

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ చారిత్రాత్మక కధతో తెరకెక్కబోతున్న తాజా చిత్రం బింబిసార. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదల అయింది. దీంతో కళ్యాణ్ రామ్ అభిమానులు భారీ అంచనాలను ఈ సినిమా పై పెట్టుకున్నారు. ఇక ఈ టీచర్ విషయానికొస్తే ఇందులోని విజువల్స్, వాయిస్ ఓవర్ అండ్ యాక్షన్ మరియు ఎలివేషన్ షార్ట్ చాలా బాగున్నాయి అని చెప్పవచ్చు.

మోస ముహూర్తం తాలూకు ధైర్యాన్ని ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు అక్కగారు చూసి తలవంచి బానిసలు అయితే.. అంటూ సాగిన డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక బింబిసార సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నాడు. ఇది కళ్యాణ్రామ్ నెత్తుటి సంతకం అన్నట్లుగా ఉంది టీజర్. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో చాలా క్రూరమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు.

ఇక టీజర్ లొ కళ్యాణ్ రామ్ బాగా ఆకట్టుకున్నాడు, బిందుసార అనే క్రూరమైన రాజుగా శక్తివంతమైన పాత్రలో నటించనున్నారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలు కేథరిన్ సంయుక్త మేనన్ కథానాయకులుగా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Share.