వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అందరికీ తెలిసిందే.. ఇక వీరి నిశ్చితార్థం జూన్ 9న మెగాస్టార్ ఫ్యామిలీతో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి విషయానికి వస్తే ఆగస్టులో జరగబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు.
అయితే మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ నెలలో వీరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్గా జరగబోతోందని సమాచారం.. అయితే వీరి పెళ్లికి ఇంకా కొద్దిరోజులే టైం ఉంది ఈ టైంలో లావణ్య త్రిపాఠితో, వరుణ్ తేజ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని కొంతమంది నేటిజన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెడుతున్నారు. మరి దానికి కారణం ఏంటి అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.ఈ మధ్యనే వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కానీ అది బాక్స్ ఆఫీస్ వద్ద డిజార్డర్గా మిగిలింది.అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు.
అదేంటంటే లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు కావటం వల్ల చిరంజీవి భోళా శంకర్ ఫ్లాప్ అయ్యింది. అలాంటిది ఇప్పుడు ఈమె.మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో ఇంకా ఎన్ని జరుగుతాయో ఒక్కసారి ఆలోచించండి అంతేకాకుండా ఆమెతో పెళ్లి క్యాన్సల్ చేసుకోండి అంటూ నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు.
అయితే ఈ వార్తలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మెగా అభిమానులు సినిమా ప్లాప్ కావటం లావణ్య త్రిపాఠి తప్పా. డైరెక్టర్ చేసిన తప్పుకి ఆమెను ఎందుకు నిందించాలి. అలాగే వరుణ్ తేజ్ ,లావణ్య చాలా ఏళ్ల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. మరి అప్పటి నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా అంటున్నారు. అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగైతే ఈ మధ్యనే క్లీన్ కార కూడా పుట్టింది ఆమె జాతకం ప్రకారం చాలా అదృష్టవంతురాలని తెలిసింది. అంతేకాకుండా క్లీన్ కారా పుట్టిన తర్వాతే ఈ సినిమాలు ప్లాప్ అయ్యాయి అంటే క్లిన్ కార దురదృష్టవంతురాలు అని అంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.