ప్రముఖ నటుడు అది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ నీవెవరో ‘ ఈ చిత్రం రెండవ ట్రైలర్ కొద్దీ నిమిషాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసారు. ట్రైలర్ ని బట్టి ఇది ఒక కామెడీ థ్రిల్లర్ అని అర్ధం అవుతుంది. ఈ సినిమాకి కోన వెంకట్ రచయితగా పని చేసారు. తొలి సారి కోన వెంకట్ ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించటం విశేషం.
హరి నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు. అందాల భామలు తాప్సి పన్ను మరియు రితిక సింగ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంగీత దర్శకుడు గిబ్రాన్ ఈ సినిమాకి స్వరాలూ అందించారు. ఎం వి వి సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రాన్ని ఎం వి వి సినిమాస్, కోన వెంకట్ ప్రెసెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ నెల 24 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.