టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీకి నయనతార సుపరిచితమే. నయన్ చేసే సినిమాలు కొంచెం త్రిల్లింగ్ గా ఉంటాయి.ఆమె కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకుంది. సౌత్ ఇండస్ట్రీలో నయనతార టాప్ హీరోయిన్ల పొజిషన్లో ఒకరని చెప్పవచ్చు.ఆమె సినిమాలతో అభిమానులను ఎంత బాగా అలరించిందో.. అంతకంటే ఎక్కువ ఎఫైర్స్, గాసిప్స్ విషయాలలో ఇంకాస్త క్రేజను సంపాదించుకుంది.ఇలాంటి గాసిప్స్ వేరే హీరోయిన్ పై రాలేదు అన్నట్లు ఆమెపై కథనాలు వచ్చాయి. ఆమె డైరెక్టర్లతో హీరోలతో ప్రవర్తించే తీరును బట్టి అలా అంటున్నారు.
నయనతార తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఎప్పుడూ ఏ సినిమా ప్రమోషన్ కూడా రాలేదు. కెరీర్ మొదట్లో ఒకటో రెండో ప్రమోషన్లకి వచ్చింది. ఆ తర్వాత రాను రాను పూర్తిగా దూరం అయ్యింది. కానీ “శ్రీరామరాజ్యం” సినిమా ప్రమోషన్ కి వచ్చింది. ఆ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు అప్పట్లో సిద్ధమైందట.
ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ తో ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లల్ని పుట్టాక కూడా సినిమాల్లో నటించింది. తన భర్త విగ్నేష్ తెరకెక్కించిన పలు సినిమాలకు నిర్మాతగా.. హీరోయిన్ గాను వ్యవహరిస్తోంది. అయితే ఆమె చేసే సినిమాలకు ప్రమోషన్లు చేయటంతో నయనతారపై విమర్శలు వెల్లువడుతున్నాయి. నీవి మాత్రమే డబ్బులా నిర్మాతలవి డబ్బులు కాదా.? అంటూ పలువురు ప్రశ్నలు లేవలెత్తుతున్నారు. ఇలాంటి సమస్యలు వస్తాయనే తెలిసి ఒక ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ప్రశ్నలు అడిగించుకుని కవర్ డ్రైవ్ లాంటి సమాధానాలు ఇచ్చింది.
ఆమె నటించిన కనెక్ట్ సినిమా ప్రమోషన్ కి సుమ ఇంటర్వ్యూ చేసింది. ఇన్ని రోజుల్లో మీరు ఏ ఇంటర్వ్యూలోను పాల్గొనలేదు. ఎందుకు అని సుమా అడగ్గా.. సుమ గారు మీతో నేను చాలా రోజుల నుంచే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను కానీ మీరు బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను వేరే వాళ్ళతో చేయటం ఇష్టం లేక చేయలేదు. అని నవ్వుతూ చెప్పింది. దీంతో అక్కడి నుంచి తప్పించుకుంది నయనతార.