సుమారుగా 20 ఏళ్లుగా సినీ ప్రియులను అలరిస్తున్న అగ్ర హీరోయిన్ నయనతార వివాహం తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. 2003లో విడుదలైన మలయాళం చిత్రం మానసినాకేర్ చిత్రంతో తన కెరియర్ను ప్రారంభించింది. ఆ తర్వాత తమిళ్, హిందీ ,మలయాళం, తెలుగు వంటి భాషలలో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలలో నటించింది నయనతార. ఒకవైపు గ్లామరస్ పాత్రలలో నటిస్తూనే మరొకవైపు కథానాయకగా ప్రాధాన్యత ఉండే పాత్రలలో కూడా నటిస్తూ వస్తోంది. ఇక భర్త విగ్నేష్ శివన్ తో కలిసి రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను 2021లో ప్రారంభించింది.
దక్షిణాదిలోని అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్గా నయనతార పేరు సంపాదించింది. కెరియర్ ప్రీక్స్ లో ఉన్న స్టేజ్ లోనే నయనతార ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్లో నయనతార, విగ్నేష్ సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. నటనకు కాస్త విరామం ఇచ్చి తన పిల్లల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నయనతార భావిస్తున్నట్లుగా సమాచారం.అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. అంతేకాకుండా నయనతార మళ్ళీ పిల్లల్ని కనలని చూస్తోంది అంటు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం నయనతార జవాన్ లేడీ సూపర్ స్టార్ 75, ఒక తమిళ చిత్రంలో మాత్రమే నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి నయనతార దంపతులు తన పైన వచ్చిన వార్తలకు ఏవిధంగా స్పందిస్తారు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నయనతార పైన ఏదో ఒక వార్తలు ఎప్పుడూ వైరల్ గానే మారుతూ ఉంటాయి. నయనతార చివరిగా నటించిన కనెక్ట్ సినిమా గోరంగా డిజాస్టర్ ని చవిచూసింది