Nayanthara..సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్గా పేరు పొందిందిన హీరోయిన్ లలో నయనతార(Nayanthara) కూడా ఒకరు.ఈ స్థాయిలో ఈమె పాపులారిటీ రావడానికి ముఖ్య కారణం ఇమే నటనే అని చెప్పవచ్చు. సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్గా కూడా పేరుపొందింది. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో హర్రర్ చిత్రాలలో కూడా నటించిన నయనతార కెరియర్ పరంగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా నయనతార పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.
నయనతార మాట్లాడుతూ స్టార్ డైరెక్టర్ మురగదాస్ తనని మోసం చేశారని ఆయన గతంలో గజిని సినిమాకు నన్ను తీసుకున్నారు కానీ సినిమాకు ముందు ఒక విధంగా కథ చెప్పి ఆ తర్వాత కథ మార్చి నన్ను మోసం చేశారని సినిమాలో ముందుగా నన్ను మెయిన్ హీరోయిన్ అని చెప్పారు.. కానీ తర్వాత మాత్రం నన్ను సెకండ్ హీరోయిన్ గా చేసేసారని తెలిపారు.
అంతేకాకుండా తనకు సూర్య మధ్య ఉన్న కొన్ని సీన్లను కూడా తీసివేయడం జరిగింది. దీంతో నేను సెకండ్ హీరోయిన్ అయిపోయాను ఒకవేళ ఆ సన్నివేశాలు ఉండి ఉంటే నేనే మెయిన్ హీరోయిన్ గా కనిపించేదాన్ని అంటూ తన సంచలన వ్యాఖ్యలు తెలుపుతోంది నయనతార. దీంతో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇంత పెద్ద హీరోయిన్ విషయంలోనే ఇంత మోసం జరిగిందా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నయనతార, తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్న ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. అయితే వీరి పెళ్లి తర్వాత అద్దె గర్భం ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లితండ్రులయ్యారు. అయితే ఈ విషయం అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నయనతార పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. నిర్మాతగా కూడా పలు సినిమాలకు మారినట్లు తెలుస్తోంది.