సినీ ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు ఏ హీరోయిన్ కూడా వివాదాలలో చిక్కుకోవాలని కోరుకోదు.. ఎందుకంటే ఎవరి మీద అయినా విమర్శలు చేస్తే తమ కెరియర్ ముందుకు వెళ్లలేదని భయంతో అలా చేస్తూ ఉంటారు.. అందుకే హీరోయిన్స్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే కాస్త సర్దుకొని వెళుతూ ఉంటారు. అయితే ఒక్కసారి ఇండస్ట్రీకి దూరమైతే మాత్రం వారికి ఎదురయ్యే చేదు అనుభవాల గురించి తెలియజేస్తూ ఉంటారు. అలా యమదొంగ సినిమాలో నటించిన మమతా మోహన్‌దాస్ ఒక సినిమా పాట విషయంలో తన అసంతృప్తి నీ తెలియజేస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాఖీ రాఖీ సాంగ్ తో సింగర్ గా తెలుగు తెరకు పరిచయమైన మమతా మోహన్ దాస్.. రాజమౌళి యమదొంగ సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది. ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత చిన్న సినిమాలలో పలు లీడ్ రోల్స్ లో కూడా నటించింది. కేవలం నటిగానే కాకుండా ప్రత్యేక గీతాలలో కూడా కనిపించి సందడి చేసింది ఈ అమ్మడు అయితే తాను ఒక స్టార్ హీరోయిన్ విషయంలో బాధపడినట్లుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.
రజనీకాంత్ తో నటించిన ఒక సినిమాలో ఒక అవకాశం వచ్చిందని ఈ సినిమాలోని పాటని నన్ను సంప్రదించారు. నేను నాలుగు రోజుల షూట్ లోనే పాల్గొన్నాను కానీ ఫైనల్ కాపీ వచ్చాక తన షాట్స్ అసలు అందులో లేవని కేవలం ఒక్కసారి వెనుక నుంచి కనిపిస్తానని ఈ పాట నాకు చెప్పినట్లు తీయలేదు. దానికి ఈ సినిమాలోని హీరోయిన్ కారణమని వేరే వారు చెబితే అర్థమైందని తెలుపుతోంది. ఇక ఆమె ఎవరో కాదు నయనతార. మరొక హీరోయిన్ ఉందని ఆమెకు ముందే చెప్పలేదని అందుకే నేను ఉంటే షూటింగ్ కి రానని చెప్పిందట అందుకే నా పార్ట్ చాలా వరకు సైడ్ చేశారని కానీ అందుకోసం నాలుగు రోజులు సమయాన్ని కేటాయించిన ఎలాంటి ప్రయోజనం లేదని మమతా మోహన్‌దాస్ బాధపడుతూ తెలియజేసింది.