స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. తెలుగులో లక్ష్మీ, తులసి, యోగి లాంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.ఈమె,దర్శకుడు విగ్నేష్ శివన్ తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా నయనతార చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో నాలుగు పడక గదుల ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
త్వరలోనే కాబోయే భర్త విగ్నేష్ తో కలసి కొత్త ఇంటికి మారుతుందని ప్రచారాలు జరుగుతున్నాయి. నయనతార కొత్త ఇల్లు తీసుకున్న పోయెస్ గార్డెన్ చెన్నైలోని నాగరిక ప్రదేశాలలో ఒకటి. నయనతార కొనుగోలు చేసిన ఈ గార్డెన్ కు మంచి సెలబ్రిటీ చరిత్ర కూడా ఉంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్ ల నివాసాలు ఈ పోయెస్ గార్డెన్ లోనే ఉన్నాయి. హీరో ధనుష్ రజినీకాంత్ ఇంటి పక్కనే తన డ్రీమ్ హౌస్ నిర్మిస్తున్నారు.