వరుస విషాద సంఘటనలు చూస్తూ ఉంటే సినీ ఇండస్ట్రీకి ఏదో పీడ పట్టుకుంది అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పదుల సంఖ్యలో సెలబ్రిటీ తారలు మరణించిన విషయం తెలిసిందే.. అయితే కేవలం తాజాగా ఒక రెండు వారాల లోపే వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో కన్ను మూశారు. అయితే ఆ తర్వాత ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిమోనియా వ్యాధితో బాధపడుతూ మరణించగా, ఆ తర్వాత అబ్బవరపు కిరణ్ సోదరుడు రోడ్ యాక్సిడెంట్ లో మరణించాడు. నిన్నటికి నిన్న ప్రముఖ యాంకర్ అలాగే నటి అయిన అనసూయ తండ్రి కాన్సర్ తో మరణించాడు. ఇక ఈ సంఘటనలన్నీ మర్చిపోకముందే తాజాగా నటుడు సత్యరాజ్ చెల్లెలు కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
సత్యరాజ్ చెల్లెలు కల్పన మండ్రాదియార్ కన్నుమూశారు. తమిళనాడులోని తిరుప్పుర్ జిల్లా కంగేయంలో నివసించే కల్పన ఆరోగ్యం వారం రోజుల నుండి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే ఆమెను కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. 66 ఏళ్ల కల్పన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆవిడ శనివారం ప్రాణాలు విడిచారు. ఆమె మృతితో సత్యరాజ్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.