నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

 సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో టాలీవుడ్లో ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని కొందరు నటీనటులు అభిమానులు కోరుకుంటున్నారు.ఇలాగే గత కొన్ని రోజుల క్రితం, ఇంట్లో కాలుజారిపడగా.. సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరొకసారి అనారోగ్య సమస్యతో హాస్పిటల్లో చేయగా ఆయన అభిమానుల్లో కాస్త ఆందోళన చెందుతున్నారు.

ఇక కైకాల సత్యనారాయణ విషయానికొస్తే..1959 సంవత్సరంలో సిపాయి కూతురు సినిమాతో వెండితెరపై అడుగు పెట్టాడు. ఎన్నో సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు కూడా పోషించాడు. ఇక సినీ పరిశ్రమలో తన కంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకున్నాడు కైకాల. ఈయన ఇప్పటి వరకు 777 సినిమాలలో నటించారు.

కేవలం ఒక్క కైకాల మాత్రమే.. పారాణిక, జానపద, చారిత్రక, హాస్య, విలన్, హీరోగా నటించిన ఘనత ఈయనకు మాత్రమే దక్కింది. Sr. ఎన్టీఆర్, కైకాల మంచి అనుబంధం ఉండేది అని పలుమార్లు కైకాల సత్యనారాయణ తెలియజేశారు.

Share.