నాగ శౌర్య ‘నర్తనశాల’ రివ్యూ – రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ నర్తనశాల మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఛలో సినిమా తరువాత ఈ హీరో నటిస్తున్న సినిమా కావడంతో నర్తనశాల కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అనుకుంటున్నారు చిత్ర యూనిట్. ఇక నందమూరి తారక రామారావు చేసిన ‘నర్తనశాల’ టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడంతో ప్రేక్షకుల్లో కూడా దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ నర్తనశాల ప్రేక్షకులను అలరించిందో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:
అమ్మాయి పుడుతుందని ఎంతో ఆశపడ్డ శివాజిరాజా దంపతులకు అబ్బాయి పుడుతాడు. దీంతో నాగశైర్యను అమ్మాయిలా జాగ్రత్తగా పెంచుతాడు శివాజిరాజా. కట్ చేస్తే.. అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్‌ ట్రెయినింగ్ ఇస్తుంటాడు నాగశౌర్య. అమ్మాయిలంటే ఎలాంటి ఫీలింగ్ లేని నాగశౌర్య‌ను ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు హీరోయిన్లు సత్య యామిని, కశ్మీరా. అసలు నాగశౌర్య ఇలా మారడానికి కారణమేమిటి..? అతడు ఎవరి ప్రేమలో పడతాడు..? నాగశౌర్య చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ:
నర్తనశాల అని ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టుకున్న నాగశౌర్య ఈ సినిమాతో ఎలాంటి మాయ చేస్తాడా అని ఆశపడ్డ ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఈ సినిమాలో పెద్దగా మ్యాటర్ ఏమీ లేకపోవడంతో సగటు ప్రేక్షకుడు ఇది ఎప్పుడు పూర్తవుతుందా అని తలపట్టుకుంటాడు. సినిమా చూసినంత సేపు నరకంలా భావిస్తాడు. కొన్ని సీన్లు మాత్రం బాగా ఎలివేట్ కావడంతో ప్రేక్షకుడు కాస్త ఊరట చెందాడు. గే పాత్రలో నాగశౌర్య ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

సినిమాలో మెయిన్ పాయింట్ ఏమిటనేది చూపించడంలో విఫలమయ్యారు చిత్ర యూనిట్. ఫస్టాఫ్‌లో ఏదైనా కొత్తదనం ఉంటుందేమో చూద్దామనుకున్న ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. పోనీ సెకండాఫ్‌లో ఏదైనా ముఖ్యమైన పాయింట్ ఉందేమో అని చూస్తే అందులో కూడా అదే రిపీట్ అయ్యింది. దీంతో థియేటర్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఈ సినిమాపై పూర్తి విరక్తి చెందినట్లు కనిపిస్తాడు. కొన్ని కామెడీ సీన్లు ఉన్నా అవి పాత చింతకాయ పచ్చడిలా ఉండటంతో జనాలు నవ్వలేక పోయారు. పాటలు, మ్యూజిక్ పర్వాలేదనిపించాయి. హీరోయిన్ల అందాల ఆరబోత ఒక్కటే ఈ సినిమాలో చెప్పుకోతగ్గ విషయంగా నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే నర్తనశాలలో నాగశౌర్య పాత్రలోనే కాదు సినిమాలో కూడా మ్యాటర్ లేదని తేలిపోయింది.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఛలో వంటి బ్లాక్ బస్టర్ తరువాత నాగశౌర్య నటించిన ఈ సినిమా కోసం యూత్ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే యూత్‌కు ఏమాత్రం కనెక్ట్ కాని సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాడు మన హీరో. ఈ సినిమాలో మనోడు గే గా చేసిన ఎక్స్‌ప్రెషన్స్ బాగానే ఉన్నాయి. కాని ఒక్క హీరోతోనే సినిమా హిట్ అవ్వదు. హీరోయిన్లు ఉన్నారంటే ఉన్నారు. శివాజిరాజా కామెడీ చాలా బోరింగ్‌గా ఉంటుంది. మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి ఎంచుకున్న పాయిట్ బాగానే ఉన్నా దాన్ని ప్రెజెంట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమాలో హీరోను గే గా చూపించి క్రెడిట్ కొట్టేయాలని చూసి చేతులు కాల్చుకున్నాడు ఈ డైరెక్టర్. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్‌లో తెరకెక్కించిన పాటలు చాలా అందంగా చూపించాడు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఉషా ముల్పురి నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా: నర్తనశాల.. హీరోలోనే కాదు సినిమాలో కూడా మ్యాటర్ లేదు!

రేటింగ్: 2.25/5

Share.