సీనియర్ నటుడు నరేష్ మరొకసారి ఒక కొత్త వివాదంతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే ఆయన మాజీ భార్య రమ్య రఘుపతి తనపై కుట్రలు పన్నుతోందని తనపై దాడి చేయించేందుకు పలు ప్రయత్నాలు కూడా చేస్తోందని నరేష్ ఆరోపించాడు. అంతేకాకుండా తనకు ప్రాణహాని కూడా పొంచి ఉంది అనే ఆరోపణలు చేసిన నరేష్.. రమ్య రఘుపతి తో మళ్ళీ నాకు జీవితాన్ని కొనసాగించాలని లేదు అంటూ కూడా ఒక వీడియోని కూడా షేర్ చేశాడు. ఈ కేస్ ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. త్వరలోనే విడాకులు కూడా వస్తాయని ఆయన తెలియజేశారు..
ఇలా ఉండగా ఎప్పుడైనా కూడా రమ్య తనపై దాడి కూడా చేయించే అవకాశం ఉందని, నరేష్ కోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఊహించని విధంగా నరేష్ ఇంటి పై ఆదివారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. నరేష్ క్యారవాన్ తో పాటు ఇతర వాహనాల అద్దాలను కూడా దుండగులు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.. ఆ దాడి చేయడానికి వచ్చిన వారు ఎవరో తనకు తెలియదు కానీ చేయించింది మాత్రం తన మాజీ భార్య రమ్య అంటూ నరేష్ ఆరోపించాడు.
అంతేకాకుండా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు నరేష్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని రమ్య నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందని కూడా కంప్లైంట్ లో వివరణ ఇచ్చారు.. ఇకపోతే గత కొంతకాలంగా ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో నరేష్ కు సంబంధించిన పెళ్లి వార్తలు జోరుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోని నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి తో నరేష్ కు గొడవలు ఎక్కువవుతున్నాయి. ఇక అప్పటినుంచి వీరిద్దరి మధ్య శత్రుత్వం బాగా బలపడింది అని చెప్పవచ్చు.