టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హీరో మరియు కమెడియన్గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసిన వ్యక్తి నరేష్ .ఇక ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కామెడీ హీరోగా రాజేంద్రప్రదేశ్ తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించింది ఈ హీరో మాత్రమే. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో తీరికలేకుండా నటించి ఎంతో గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ నిత్యం ఏదో ఒక వార్తల్లో ట్రెండింగ్ లో నిలుస్తున్నాడు నరేష్.
నరేష్ కి మూడు పెళ్లిళ్లు జరిగిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు నాలుగో పెళ్లికి కూడా రెడీ అవుతున్న విషయం కూడా తెలిసిందే. అయితే మూడో భార్య రమ్య రఘుపతి విడాకులు ఇవ్వకుండా నరేష్ నాలుగో పెళ్లి ఎలా చేసుకుంటాడు ఆమె విడాకులు ఇవ్వటానికి అంగీకరించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి..ఎందుకంటే నా కొడుక్కి తండ్రి అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. మొన్నటికి మొన్న నరేష్, పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నట్లు లిప్ లాక్ పెట్టుకొని మరీ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు.ఆ సీన్ చూసి రమ్య రఘుపతి రెచ్చిపోవటానికి కారణం ఏంటా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
అయితే నరేష్ ఓ గుడ్ న్యూస్ అంటూ చెబుతున్నాడు ఇంతకు ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్న విషయం ఇంతవరకు బయటకు తెలియటం లేదు. ఒకవేళ గుడ్ న్యూస్ అంటే పెళ్లి గురించేనని అంతా అనుకుంటున్నారు కానీ నరేష్, పవిత్రలు ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నారని ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా నరేష్ గుడ్ న్యూస్ అంటూ కామెంట్ చేస్తున్నారని.. ఒకవేళ సినిమాకి అదే పేరును ఫిక్స్ చేస్తుంటారని ఇండస్ట్రీలో ట్రాక్ వినిపిస్తోంది.మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.