సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలిచే ఒకే ఒక్క న్యూస్ పవిత్ర లోకేష్, నరేష్.. విభేదాల కారణంగా ఆయన తన మూడవ భార్య రమ్య రఘుపతి కి దూరం అయ్యాడు.. అయితే చాలాకాలం నుంచి నరేష్, పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. కానీ వీరు మాత్రం ఎప్పుడూ ఆ విషయాన్ని బయట పెట్టరు. కలసి పూజలు నిర్వహిస్తారు.. ఫంక్షన్లకు, పార్టీలకు, ఆఖరికి ఎవరినైనా మరణించినప్పుడు చూడడానికైనా సరే జంటగా వెళుతూ ఉంటారు. దీంతో నెవర్ ఎండింగ్ స్టోరీ లా వీళ్ళ వ్యవహారం కొనసాగుతూనే ఉంటుంది.
ఇకపోతే ఈ ఏడాది ఒక వీడియో షేర్ చేసి పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించిన ఈ జంట గత కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్న వీడియోను షేర్ చేసి నెట్టింట దుమారం రేపారు. కానీ అదంతా ఒక సినిమా కోసమే అని చెప్పి మళ్ళీ వార్తల్లో నిలిచింది ఈ జంట. వీరిద్దరూ సహజీవనం చేస్తున్న మాట వాస్తవమే కానీ వివాహం చేసుకుంటారా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్ధకంగానే మారింది. ఇకపోతే ఇటీవల నరేష్ , పవిత్ర ఇద్దరూ విజయనిర్మల స్వగ్రామం అయిన ఏలూరుపాడుకి వెళ్లినట్లు తెలుస్తోంది.
నరేష్ తల్లి విజయనిర్మల సొంత ఊరు ఇదే. అక్కడ బంధువుల ఫంక్షన్ కి వీరిద్దరూ కలిసి వెళ్లారు. అనంతరం నరేష్ , పవిత్ర అక్కడ స్థానికంగా ఉన్న అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ , అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించిన వీరు తిరిగి హైదరాబాదుకు పయనమయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇలా తన స్వగ్రామాన్ని కూడా పవిత్ర లోకేష్ ను ఆయన తీసుకువెళ్లడం మరింత సంచలనాలకు దారితీస్తోంది. మరి వీరు పెళ్లి చేసుకుంటారా లేక సహాజీవనం వరకే ఆపివేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.