టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వికే.నరేష్ సుపరిచితమే.. నరేష్ నటించిన పలు సినిమాల ద్వారా చాలా ఫేమస్ అయ్యారు.అప్పట్లో కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన జంబలకడిపంబ ఓ రేంజ్ లో హిట్టును సాధించింది. నరేష్ తల్లి విజయనిర్మలనే ఈమె కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి అవకాశాలను సొంతం చేసుకున్నాడు నరేష్.
అప్పట్లో జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన హై హై నాయక, బావా బావా పన్నీరు సినిమాలతో నటుడిగా తనదైన స్టైల్ లో అందరినీ మెప్పించాడు.ఈమధ్య ఈయన సినిమాలతోనే కాకుండా కాంట్రవర్సీ లతో న్యూస్ లో నిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు రీసెంట్ గా మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.
ఆ సినిమా తన భార్య గురించి చెప్పటానికే ఈ సినిమాను తీసినట్లు తెలుస్తోంది. అయితే నరేష్ అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి సంచలనకరమైన కామెంట్లు చేశారు.పెళ్లి అంటే ఒకప్పుడు ఎంతో పవిత్రమైన బంధం అలాగే భార్యాభర్తలు అన్ని విషయాలను షేర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్న ఎవరు బిజీలో వారు ఉంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే జనరేషన్ కి పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఏ ఉండదు.
ఎందుకంటే భార్య భర్త ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండకపోతే విడాకులకు దారితీస్తుంది. అంతేకాకుండా డివోర్స్ కోసం కోర్టుకు వెళితే అక్కడ కూడా ఆడవాళ్ళకే మద్దతు ఇస్తుంది. మగాడికి జరిగే అన్యాయం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అలాంటప్పుడు మగవాళ్ళు భయపడి సూసైడ్ కి దారి తీస్తున్నారు. కాబట్టి వారి గురించి కూడా కొంచెం ఆలోచించండి అని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.