గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు నరేష్, పవిత్ర లోకేష్.. అయితే వీరిద్దరూ గడిచిన కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతూనే ఉంది.. అయితే వీరిద్దరిని కలిపింది ఒక పెద్దాయన అంటూ తెగ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నరేష్, పవిత్రాలను ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు తన సినిమా ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
ఎస్ ఇదంతా తన సినిమా స్ట్రాటజీ ప్రకారమే చేశారంటూ టాక్ వినిపిస్తోంది. మనకు తెలిసింది డిఫరెంట్ కాన్సెప్ట్ చూసి చేసుకొని సినిమాల నిర్మించడంలో ఆయనకు ఆయన సాటి అని చెప్పవచ్చు. అయితే అదే విధంగానే సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.. రీసెంట్గా డర్టీ హరి అనే సినిమాను తీసి ఎలాంటి క్రేజీ కామెంట్స్ ను అందుకున్నరో చెప్పాల్సిన పనిలేదు.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అనే సినిమాను చేయబోతున్నాడట రాజు.. ఈ క్రమంలోనే పవిత్ర, నరేష్ ను ఈ సినిమాలో లీడ్ గా చూపించబోతున్నట్లు సమాచారం.
వివాహం చేసుకున్నాక డివర్స్ అయితే మళ్లీ ప్రేమ పుడితే ఇంట్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో విధంగా వాటిని సినిమా రూపంలో చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ ,పవిత్ర ప్రేమను వాడుకుంటున్నారని టాక్ విషయంలో M.S రాజు పేరు బాగా వినిపిస్తోంది. మరి ఈ మేరకు ఈ విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. కానీ పవిత్ర నరేష్ మాత్రం హనీమూన్ కి వెళ్లారంటే పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.