నాని..వరుణ్ తేజ్.. ఇద్దరు సేమ్ టూ సేమ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరోలకు కొత్త ప్రయోగాల కిక్ ఏంటో తెలిసింది. అందుకే రెగ్యులర్ సినిమా కథల్లా కాకుండా కొత్త కొత్త కథలకు ప్రాణం పోస్తున్నారు. ప్రయోగం చేస్తూనే వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవకుండా ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. అయితే తెలుగులో ప్రత్యేకంగా ఇద్దరు హీరోలు తమ సినిమా సినిమాకు కొత్తగా ప్రయత్నిస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. వారిలో ఒకరు నాని కాగా.. మరో హీరో వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వరుణ్ తేజ్ రెగ్యులర్ కమర్షియల్ పంథాలో కాకుండా కొత్త కథలు ఎంచుకుంటున్నాడు.

నాచురల్ స్టార్ నాని కూడా ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్నాడు. అయితే సెట్స్ మీద ఉన్న నాని, వరుణ్ తేజ్ సినిమాలను చూస్తే.. ఇద్దరు చేసేది ఒకే టైపు పాత్రలే. నాని వి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ వాల్మీకిలో కూడా నెగటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరు తమ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాలని చూస్తున్నారు. కచ్చితంగా తెలుగు పరిశ్రమకు ఇది మంచి తరుణమని చెప్పొచ్చు.

హీరో అంటే ఇలానే ఉండాలన్న ఆలోచన తీసేసి వరుణ్ తేజ్, నాని రిస్క్ చేస్తూ తమ కెరియర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ తనకంటూ ఓ సెపరేట్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎఫ్-2 తో సూపర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ చేస్తున్న వాల్మీకి పూర్తి అయితే ఆ తర్వాత బాక్సర్ గా కనిపించనున్నాడు.

Share.