Nani.. తన నటనా ప్రతిభతో నాచురల్ స్టార్ అనిపించుకుంటున్న నాని (Nani) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మీడియం రేంజ్ హీరోగా ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు దసరా మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు ఆయన సినీ కెరియర్ లోనే ఎప్పుడు చేయని విధంగా ఊర మాస్లో ఆయన కనిపించడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ (Keerthi Suresh) నటిస్తోంది. మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నాని ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు ఇందులో భాగంగా ఒక భయానక సంఘటన గురించి కూడా ఆయన తెలిపారు.
బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఒక ప్రయోగాత్మక పాత్ర పోషిస్తున్నారు నాని.. అయితే ఒక సీన్లో డంపర్ ట్రక్ కోల్స్ ను తీసుకొని వెళ్లి డంపు చేస్తుండగా ఈ డంపర్ ట్రక్కులో నుంచీ నాని కింద పడితే ఆ బొగ్గు ఆయనపై పడే సీన్ లో ఆయన చాలా ఇబ్బంది పడ్డారట. డంపర్ లో నుంచి నేను కింద పడిపోయాను.. సింథటిక్ కోల్స్ కింది నుంచి నన్ను పైకి లాగడానికి కొంత టైం పడుతుంది . ఆ గ్యాప్లో ఊపిరి తీసుకోవడం చాలా కష్టం .. ఆ రకంగా నేను నరకం చూసాను.. ఆ సీన్ గుర్తుకొస్తే ఇప్పటికే భయం వేస్తుంది.
నిద్ర కూడా పట్టట్లేదు అంటూ నాని తెలిపారు. ఇక ఈ దసరా సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా ఆయన ఇంటర్వ్యూలో పంచుకుంటూ ఉండటం గమనార్హం.