ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై , నాచురల్ స్టార్ నాని హీరో గా, శ్రద్దా శ్రీనాద్ (యు టర్న్ ఫేం ) హీరోయిన్ గా “జెర్సీ “చిత్రం ఈ రోజు ఉదయం ఫిల్మ్ నగర్ లోని సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది .రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని నిర్మాత సూర్య దేవర నాగ వంశి తెలియ జేశారు.
ఈ సినిమా పూజ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. త్రివిక్రమ్ స్వయంగా తొలి షాట్ కి క్లాప్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో సత్యరాజ్,బ్రహ్మాజీ,రోనిత్ కామ్రా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. జెర్సీ చిత్రానికి గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నారు.
నాని జెర్సీ చిత్రం షూటింగ్ ప్రారంభం
Share.