సినీ ఇండస్ట్రీలో ఈమధ్య ఎక్కువగా పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న హీరో శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు తాజాగా నాని సినిమాలో నటించిన హీరోయిన్ హరిప్రియ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హరిప్రియ కన్నడ తో పాటు తెలుగు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం హరిప్రియ వయస్సు 31 సంవత్సరాలు తెలుగులో హరిప్రియ 10 సినిమాల దాకా చేసింది. అందులో కొన్ని హరిప్రియ కు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.
ఇక హరిప్రియ పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు కేజీఎఫ్ చిత్రంలో కీలకపాత్రలో నటించిన యువ నటుడు వశిష్ట సింహాన్ని. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటూ కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. వీరి వివాహము మైసూర్లో అంగరంగ వైభవంగా జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ వివాహ వేడుకకు కన్నడ సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరిద్దరూ సంప్రదాయ దుస్తులతో వెలిగిపోతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
గత ఏడాది డిసెంబర్లో హరిప్రియ సింహా నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో హరిప్రియ.. నా పేరు వెనక సింహ అనే ట్యాగ్ రాబోతోంది. అంటూ నిశ్చితార్థం ఫొటోస్ షేర్ చేసింది. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక వశిష్ట గురించి మనందరికీ బాగా తెలుసు ఆయన కే జి ఎఫ్- 1 కేజిఎఫ్ -2తో ఎంతో గుర్తింపు పొందాడు. వశిష్ట అంతేకాకుండా నారప్ప చిత్రంలో నటించాడు. గత ఏడాది హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తేర్కెక్కిన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో నెగిటివ్ పాత్రలో నశించాడు.వశిష్ట ఇక ఇప్పుడు హరిప్రియ వశిష్ట పెళ్లి చేసుకుని పర్ఫెక్ట్ జోడి అంటూ నేటిజన్లో కామెంట్స్ అందుకుంటున్నారు. మరోవైపు ఈ కొత్త జంట కి తన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.