నానీ గ్యాంగ్ లీడర్ టీజర్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఓ రచయిత ఐదుగురు తో కలిసి ఆడిన రీవెంజ్ డ్రామానే గ్యాంగ్ లీడర్. నేచురల్ స్టార్ నానీ నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా టీజర్ కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా పేరు చూస్తే ఓ ఫవర్ పుల్ మాస్ టైటిల్ కనిపిస్తుంది… కానీ సినిమాలో అంతా కామెడీతో నిండి ఉన్నట్లుగానే అర్ధం అవుతుంది. ఇంతకు ఈ గ్యాంగ్ లీడర్ సినిమా టీజర్ పై ఓసారి లుక్కెద్దాం…

నానీ ఈ సినిమాలో ఓ రచయితగా కనిపిస్తాడు. అతడు పెన్సిల్ అనే నిక్ నేమ్ తో రైటర్గా పనిచేస్తాడని టీజర్లో స్పష్టం చేశారు. అయితే నానీ వద్దకు రీవెంజ్ తీర్చుకునేందుకు ఓ వృద్దురాలు, పాప, ఓ గృహిణి, ఇద్దరు యువతులు వస్తారు. వీరంతా పగ ప్రతికారంతో రగిలిపోతుంటారు. వీరు నానీని అశ్రయించి నాని చేత తన ప్రతికారం తీర్చుకుంటారు.. ఐదుగురు లేడీ గ్యాంగ్ ప్రతికారాన్ని ఈ రచయిత అయిన నానీ ఎలా తీర్చాడు.. ఇంతకు ఈ ప్రతికారం ఎవరిపైనా అనేది టీజర్లో చూపించకుండా దర్శకుడు సస్పెన్స్ ను కొనసాగించాడు.. దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను ఎంతో ఉత్కంఠ కలిగించేలా, కామెడీతో కూడుకున్న పగను సాధించేలా రూపొందించారని అర్థం అవుతుంది.

మైత్రిమూవీ మేకర్స్ ద్వారా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించలేదు. సాహో సినిమా విడుదల ఉండటంతో ఈ సినిమా విడుదలకు తేదిని ప్రకటించలేదని తెలుస్తుంది. ఈ టీజర్ చూస్తే సినిమాపై భారీ హైప్ క్రియోట్ అవుతుంది. ఈ సినిమా లో సీనియర్ నటులు శరణ్య, లక్ష్మీ, ప్రియాంకా అరుల్ మోహన్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు నటిస్తున్నారు.

Share.