మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గ్యాంగ్‌లీడర్ సినిమా ఎంత బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌తో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత నేచురల్ స్టార్ నాని మళ్లీ సినిమా చేశాడు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమా ప్రీమియర్ల నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ ఏడాది `జెర్సీ`తో ఊపు మీదున్న నాని నటించిన ఇప్పుడు గ్యాంగ్‌లీడర్‌తో మరో హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నట్టే టాక్ నడుస్తోంది. ఈ సినిమా కథాపరంగా చూస్తే చుట్టూ ఐదుగురు ఆడవాళ్లు, వారి మధ్య నాని… వాళ్లందరికీ ఓ టార్గెట్. అతని పేరు రేసర్ దేవ్. క్లుప్తంగా కథ ఇది. ఈ సినిమాలో నటించిన వాళ్లందరూ ఎవరి పాత్రల్లో వాళ్లు సరిగ్గా సరిపోయారు.
రైటర్ పెన్సిల్ పార్థసారథిగా నాని, అతని ఫ్రెండ్ గా ప్రియదర్శి, బామ్మగా లక్ష్మి, కొడుకును పోగొట్టుకున్న అమ్మగా శరణ్య, కాబోయేవాడిని పోగొట్టుకున్న వ్యక్తి ప్రియాంక.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమా ప్రారంభంలో చూపించే సన్నివేశాలు బాగున్నాయి. ఇక నాని నటన మరోసారి మెప్పించింది. సినిమా అంటే కథలో దమ్ముండాలి… పాత్రలో ఒదిగిపోవాలన్న విషయాన్ని నాని మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు.
ఇక మెగాహీరోల హిట్ టైటిల్స్ పెట్టుకుని మళ్లీ మెగా హీరోలే గతంలో హిట్లు కొట్టారు. వరుణ్‌తేజ్ తన బాబాయ్ పవన్‌కళ్యాన్ తొలిప్రేమ టైటిల్ వాడుకుని హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ హిట్ టైటిల్ పెట్టుకుని మళ్లీ హిట్ కొట్టిన నాన్ మెగా హీరోగా నాని నిలిచాడు.