‘ గ్యాంగ్‌లీడ‌ర్ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

నేచుర‌ల్ స్టార్ నాని – విక్రమ్ కుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ గ్యాంగ్ లీడర్ మొదటి రోజు ఓ మోస్త‌రు వ‌సూళ్లు రాబ‌ట్టింది. డివైడ్ టాక్ అందుకున్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ 4.51 కోట్ల వాటాను వసూలు చేసింది. మెగాస్టార్ హిట్ టైటిల్‌తో వ‌చ్చిన ఈ సినిమా నాని యాక్టింగ్‌, కామెడీ బాగుంద‌ని అంటున్నా మ‌రీ హిట్ టాక్ రాలేదు.

నాని గ‌త సినిమాల ప్ర‌భావ‌మో ఏమో గాని గ‌త సినిమాల‌తో పోలిస్తే ఆ రేంజ్‌లో ఓపెనింగ్స్ రాలేదు. నాని గ‌తంలో భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, నేను లోక‌ల్ సినిమాలు తొలి రోజే రూ.8 కోట్ల వ‌ర‌కు షేర్ రాబ‌ట్టాయి. కానీ గ్యాంగ్ లీడ‌ర్ మాత్రం చాలా స్లోగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న ర‌న్ స్టార్ట్ చేసింది. మ‌రి ఫ‌స్ట్ వీకెండ్‌లో గ్యాంగ్ లీడ‌ర్ ఎలాంటి వ‌సూళ్లు రాబ‌డుతుందో ? చూడాలి.

గ్యాంగ్ లీడ‌ర్ ఏరియా వైజ్ ఫ‌స్ట్ డే షేర్ (రూ.కోట్ల‌లో)

నైజాం – 1.67

సీడెడ్ – 0.51

నెల్లూరు – 0.15

కృష్ణా – 0.33

గుంటూరు – 0.46

వైజాగ్ – 0.61

ఈస్ట్ – 0.52

వెస్ట్ – 0.26
——————————-
ఏపీ + తెలంగాణ = 4.51
——————————-

Share.