నేచురల్ స్టార్ నానికి గత కొద్ది రోజులుగా కాలం కలిసి రావడం లేదు. కృష్ణార్జున యుద్ధం – దేవదాస్ ప్లాప్ అయ్యాయి. ఇక జెర్సీ క్లాస్ టాక్‌తో గట్టెక్కినా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు గ్యాంగ్‌లీడర్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. గ్యాంగ్‌లీడర్ రేపు తెరపైకి వస్తోంది. ట్రైలర్ మరియు పాటలు ఆకట్టుకున్నాయి.
అయితే సినిమాపై చాలా తక్కువ అంచనాలు ఉండడం అందరికి షాక్ ఇస్తోంది. నాని సినిమా వస్తుందంటే మంచి హంగామా ఉంటుంది. కానీ గ్యాంగ్‌లీడర్ విషయంలో చాలా లో బజ్ ఉంది. ముందస్తు బుకింగ్‌లు చాలా డల్‌గా ఉన్నాయి. మరోవైపు ప్రమోషన్ల విషయంలో నాని ఒక్కడే తప్పా మిగిలిన వారు ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేరు.
ఇప్పుడు నాని గ్యాంగ్‌లీడర్‌కు కేవలం మౌత్ టాక్ ఒక్కడే ప్రధాన బలం. మౌత్‌టాక్ బాగుంటే సినిమా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ హిట్ సినిమా టైటిల్ వాడుకుంటూ… విక్రమ్ కె.కుమార్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నా కూడా గ్యాంగ్‌లీడర్‌కు ఎందుకో గాని ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ హైప్ రాలేదు.
ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ వారు నిర్మించారు. మైత్రీ గత సినిమా డియర్ కామ్రేడ్‌ను ప్రమోషన్లలో హోరెత్తించారు. ఇప్పుడు ఈ సినిమాకు ఎలాంటి సందడి లేకపోవడం షాకింగ్ న్యూసే. మరి గ్యాంగ్‌లీడర్ భవిష్యత్తు ఏంటో ? రేపు తేలిపోనుంది.