నాని ‘ గ్యాంగ్ లీడ‌ర్ ‘ 4 డేస్ క‌లెక్ష‌న్స్‌.. కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న నాని..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ ఏడాది వేసవిలో విడుదలైన జెర్సీ విజయంతో నేచురల్ స్టార్ నాని రైజింగ్‌లోకి వ‌చ్చాడు. మూడు నెల‌ల గ్యాప్‌లోనే నాని మ‌రోసారి గ్యాంగ్ లీడ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేశాడు. నాని – విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో వ‌చ్చిన గ్యాంగ్ లీడ‌ర్ ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా కూడా వ‌సూళ్ల‌లో జ‌స్ట్ ఓకే అనిపిస్తోంది. నాలుగు రోజుల‌కు రూ.13 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ వ‌సూళ్లు కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చిన‌వి మాత్ర‌మే. ఇక్క‌డ రూ.21 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌గా… ఇప్ప‌టికే రూ.13 కోట్లు సాధించింది. మ‌రోవైపు ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్ల దిశ‌గా వెళుతోంది.

ఈ సినిమాలో నాని స‌ర‌స‌న ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌. ఈ కామిక్ ఎంటర్టైనర్లో లక్ష్మి, శరణ్య, వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి ఇతర కీలక పాత్రలలో న‌టించారు. మైత్రీ మూవీస్ వాళ్లు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా నాలుగు రోజుల వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

గ్యాంగ్ లీడ‌ర్ 4 డేస్ ఏరియా వైజ్ షేర్ (రూ.కోట్ల‌లో) :

నైజాం – 5.20

సీడెడ్ – 1.60

వైజాగ్ – 1.73

గుంటూరు – 1.15

ఈస్ట్ – 1.13

వెస్ట్ – 0.75

కృష్ణా – 1.01

నెల్లూరు – 0.40
————————————-
ఏపీ + తెలంగాణ = 12.97 కోట్లు
————————————-

Share.