ఇలాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదు ఖబడ్దార్:బాలకృష్ణ

Google+ Pinterest LinkedIn Tumblr +

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబం పై వైయస్సార్ సిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. తాము ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదని, తన సోదరి పై వ్యక్తిగత విమర్శలు చేయడం బాగోలేదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రజలు తరఫున,పార్టీ తరఫున,తన అభిమానులు తరఫున హెచ్చరిస్తున్నానని మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదని,ఖబడ్దార్, భరతం పడతానని తెలిపారు.

ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లోని తన నివాసంలో నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో సవాళ్లు ప్రతిసవాళ్లు సాధారణంగా ఉంటాయని కానీ కుటుంబ సభ్యుల పై దాడి చేయడం సరైనది కాదని తెలిపారు. ఇప్పుడు ధైర్యం గా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఆడవాళ్ళ జోలికి వస్తే చేతులు ముడుచుకుని కూర్చునే లేదని హెచ్చరించారు. చంద్రబాబు పై దాడులకు ప్రయత్నించిన సమన్వయంతో ఉన్నామని ఇకపై ఎవరూ నోరు తెచ్చిన ఉపయోగించేది లేదని తెలిపారు. అలాగే రాజకీయాలలో అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు.

Share.