సినీ ఇండస్ట్రీలో ఒకరినొకరు ప్రేమించుకుని వివాహాం చేసుకున్న జంటలు చాలామందే ఉన్నారు. కానీ కొంతమంది జీవితంలో నిలదొక్కుకున్నారు మరికొందరు విడాకులు తీసుకున్నారు. చాలామంది రీల్ లైఫ్ లో నటించి ఆ తర్వాత రియల్ లైఫ్ లో కి ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అలాంటి జంటలలో మహేష్ బాబు, నమ్రత వీరిద్దరు కూడ ఒకరు. వీరిద్దరి జంట సినీ ప్రేక్షకులకు క్యూట్ కపుల్స్ లా కనిపిస్తారు. అలాగే ఉంటారు.
ఇదంతా కాస్త పక్కన పెడితే నమ్రత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఇండియా తరపున మిస్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. నమ్రత తన అందంతో 1993 లో మిస్ యూనివర్సిటీ పోటీల్లో నడుస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో తాజగా షేర్ చేసింది. ఆ వీడియో పై స్పందించిన నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కామెంట్లు చేయడం జరిగింది. అదేమిటంటే మేము గర్వపడేలా చేసావ్ అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఘట్టమనేని ఇంటి కోడలి పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక అక్కడ పోటీలో పాల్గొన్న తర్వాత ఇండస్ట్రీలోకీ అడుగు పెట్టింది. వంశీ సినిమా సమయంలో మహేష్ బాబు, నమ్రత స్నేహితులయ్యారు. ఆ తర్వాత అదే సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఒకసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్ కోసం న్యూజిలాండ్ కి వెళ్ళారట. అక్కడ 25 రోజులపాటు షూటింగ్ జరుగుతున్న సమయంలో వీరిద్దరి స్నేహం ఇంకాస్త బలపడి ప్రేమగా మారింది. ఆ తరువాత వీళ్ళ ప్రేమ పెళ్లికి దారి తీసింది.చూడడానికి వీళ్ళ జంట చూడముచ్చటగా ఉంటుందనే చెప్పాలి.నమ్రత తన కుటుంబ బాధ్యతలను మోస్తూ తన పిల్లలని తన ఫ్యామిలీని చూసుకుంటూ బిజీగా లైఫ్ని గడిపేస్తోంది. ప్రస్తుతం నమృత షేర్ చేసిన వీడియో వైరల్ గా మారుతోంది.<
View this post on Instagram
/p>