నమ్మి మోసపోయానంటున్న సైఫ్ అలీ ఖాన్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీ ఖాన్ హీరోగా , విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నారు. అయితే తాజాగా ఈయన డబ్బు పోగొట్టుకున్నాను అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ఒక ప్రాపర్టీ కోసం తన సంపాదించుకున్న డబ్బులలో 85% అందులో పెట్టుబడిగా పెట్టాడట. కానీ అదంతా ఒకేసారి కోల్పోవాల్సి వచ్చిందని తెలియజేశాడు. ఇక ఈ హీరో నటించిన బంటి ఔర్ బబ్లీ-2 మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ముంబై ప్రాంతంలో ఒక స్థలాన్ని కొనేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలో తన దగ్గర ఉండే డబ్బు అంతా పెట్టుబడిగా పెట్టానని, అలా పెట్టిన డబ్బంతా 3 సంవత్సరాలలో రెట్టింపు అవుతుందని ఆ కంపెనీ సంస్థ వారు తెలియజేశారు అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ కంపెనీ అంత ధీమాగా చెప్పింది కనుక.. నేను కూడా అందులో ఇన్వెస్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. కానీ అది స్కామ్ అని తెలియలేదు. దాంతో తను అప్పటివరకు సంపాదించినదంతా పోగొట్టుకున్నానని తెలియజేశాడు. ఆ విషయం తెలిసిన తరువాత మోసపోయానని అర్థమైంది అని చెప్పుకొచ్చాడు.

Share.