తెలంగాణ ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కెసిఆర్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు అల్లూరి కృష్ణంరాజు ఈ ప్రతిష్టాత్కమైన బయోపిక్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ బయోపిక్ కి ” ఉద్యమ సింహం ” అనే టైటిల్ కూడా ఖరారు చేసారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు నిన్న అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. ఈ మూవీ ని కల్వకుంట్ల నాగేశ్వరరావు పద్మనాయక ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం మొదలైన సమయం నుండి కెసిఆర్ పాత్రలో ఎవరు నటిస్తారనే దాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్న చిత్ర బృందం ఈ ఊహాగానాలకు తెరదించుతూ ప్రముఖ నటుడు ‘నాజర్’ కెసిఆర్ పాత్రా పోషిస్తారని తెలిపారు.
ఈ మేరకు కేసీఆర్ బాడీ లాంగ్వేజ్, ఆయన నడిచే విధానం, హావభావాలను నాజర్ కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కేసిఆర్ విద్య భ్యాసం, అయన కాలేజీ రోజుల్లో చేసిన పలు సామజిక అంశాలపైనా కూడా నాజర్ తెలుసుకుంటున్నారని సమాచారం. అదే విధంగా కెసిఆర్ చిన్ననాటి విషయాలను కూడా ఈ చిత్రంలో చూపించనున్నారని టాక్.
ఈ బయోపిక్ లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్నిసాధించటానికి కేసిఆర్ చేసిన ఉద్యమం, పలు ధర్నాలు, అందులో సాధించిన ఉద్యమాలు పై ఫోకస్ చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి కథ కల్వకుంట్ల నాగేశ్వరరావు అందించగా
వరికుప్పల యాదగిరి సంగీతం సమకూరుస్తున్నారు. నవంబర్ 29న విడుదల ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.
మరో ఉద్యమం దిశగా కేసిఆర్?
Share.