ఆ స్టార్ హీరో చేతిలో ఘోరంగా అవమానపడ్డ నగ్మా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా పేరు పొందిన నగ్మా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమెతో సినిమాల కోసం అప్పట్లో దర్శక నిర్మాతలు వెంటపడి చేసేవారు. అప్పట్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది నగ్మా . ఈ అమ్మడు బికినీ అందాలను సౌత్ ఇండస్ట్రీకి పరిచయం చేసిందే నగ్మా.

Actress-politician Nagma Falls Prey to KYC fraud, Loses Rs 1 Lakh - News18

అప్పట్లో ఇద్దరు హీరోయిన్ల కథలు ఉంటే అందులో మెయిన్ హీరోయిన్ గా నగ్మానే ఎంచుకునేవారు. అలా ఆమె కొన్నాళ్లపాటు బిజీ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. కానీ ఎప్పుడు ఎఫైర్ వార్తల్లో ఈమె టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచేది..అప్పట్లో ,శరత్ కుమార్, గంగోలి ఇలా చాలామంది స్టార్లతో ఈమె ప్రేమాయణం నడిపినట్లు పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉండేవి.

అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్లలో నగ్మాదే సంపాదన ఎక్కువ.. ఇలా అప్పట్లో ఓ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ని ఓ స్టార్ హీరో ఘోరంగా అవమానించాడు. అతను తెలుగులో స్టార్ హీరో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో అతను టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు.అయితే అతని సినిమాలో నగ్మా నటిస్తున్న సమయం లో ఆమె రోజు షూటింగ్ కి లేటుగా రావడం గమనించి ఆయన నగ్మానం అడగగా.. అప్పుడు ఆమె తిక్క తిక్క సమాధానాలు చెబుతూ మాట్లాడిందట. దీంతో స్టార్ హీరో కి కోపం వచ్చి నీ ఆస్తి విలువ ఎంత అని నగ్మాని ప్రశ్నించాడట..

అప్పుడు నగ్మా ఒక నెంబర్ చెప్పగా అందుకు ఆ స్టార్ హీరో నీఆస్తి నా బాత్రూం అంతా కూడా ఉండదు. సభ్యత సంస్కారం పనిపై గౌరవం ఉండాలి.అప్పుడే డబ్బు కానీ గౌరవం కానీ వెతుక్కుంటూ వస్తాయంటూ నగ్మా కి క్లాస్ పీకాడట. అయితే ఆ హీరో ఎవరు అన్నది చెప్పకుండానే నగ్మా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ప్రస్తుతం నగ్మా గురించి ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.

Share.