నాగ శౌర్య.. లక్ష్య మూవీ ట్రైలర్ రిలీజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో నాగశౌర్య కూడా ఒకరు. నాగ శౌర్య నటించిన తాజా చిత్రం లక్ష్య. ఈ చిత్రం కోసం హీరో నాగశౌర్య ఎంతో కష్టపడి తన ఫిజిక్ ను మార్చుకున్నాడు. ఈ మూవీ కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా ఒక అప్డేట్ తో మంచి హైప్ ను సొంతం చేసుకుంటుంది. మరీ సినిమా నుండి తాజాగా ట్రైలర్ విడుదల కాగా, ఇప్పుడు ట్రైలర్ విషయాలను చూద్దాం.

సినిమా మొత్తం నాగశౌర్య లుక్స్ హైలెట్ గా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నాగ శౌర్య డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్నాడు. అలాగే డైరెక్టర్ సంతోష్ టేకింగ్ లో కూడా మంచి సీరియస్ నేస్ కనిపిస్తోంది.హీరో చుట్టూ గేమ్ కు సంబంధించి కొన్ని విషయాలు బాగా చిత్రీకరించారు డైరెక్టర్. అయితే సినిమా ఎలా ఉందో తెలియాలంటే డిసెంబర్ 10వ తేదీ వరకు ఆగాల్సిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ ను మీరు కూడా ఒకసారి చూసేయండి.

Share.