కింగ్ నాగార్జున హీరోగా విజయభాస్కర్ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ మన్మథుడు. ఆ సినిమాకు సీక్వల్ గా నాగార్జున, రాహుల్ రవింద్రన్ కాంబినేషన్ లో మన్మథుడు 2 వస్తుంది. అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మించబడిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్, సమంతలు గెస్ట్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా ఆగష్టు 9న రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. ట్రైలర్ సినిమాలో ఎమోషన్, కామెడీ, స్టోరీ ఇలా ప్రతి ఒక్క కాన్సెప్ట్ ను కవర్ చేసినట్టు తెలుస్తుంది. మన్మథుడు 2 అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. నాగార్జున ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ అందాలు సినిమాకు ప్లస్ అవనున్నాయి.
చిలసౌతో సత్తా చాటిన దర్శకుడు రాహుల్ రవింద్రన్ నాగ్ తో చేస్తున్న ఈ సినిమాతో కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. ఇప్పటివరకు కృష్ణావతారం ముగిసింది ఇక రామావతారం స్టార్ట్ అంటున్నా వెన్నెల కిశోర్ పంచ్ అదిరింది. ఫైనల్ గా మన్మథుడు 2 అక్కినేని ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సిని లవర్స్ కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చేలా ఉంది.