తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంత ఇమేజ్ ఉందో అలాగే అక్కినేని వారసునిగా నాగార్జునకి కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాగార్జున మన్మధుడిగా కింగ్ గా ఇండస్ట్రీలో అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతో పేరుని సంపాదించుకున్నాడు. మంచి మంచి కథలను ఎంచుకొని ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా తన రేంజ్ను తగ్గకుండా చూసుకుంటున్నాడు. బిగ్ బాస్ షో తో ఆయనకి ఇంకాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో అప్పట్లో ఉన్న అగ్ర హీరోలకు పోటీగా నిలిచి స్టార్ హీరోగా ఎదిగాడు.
60 ఏళ్లు పైబడిన కూడా తన కొడుకులకు దీటుగా అలాగే ఇతర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కింగ్ నాగార్జున. ఇక తన కొడుకు నాగచైతన్య అలాగే అఖిల్ కూడా సినీ రంగంలో పెద్దగా రాణించలేకపోతున్నారు.ఇలా ఉండగా రీసెంట్ గా నాగార్జున ఆరోగ్యం గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. నాగార్జునకు ఓ అరుదైన వ్యాధి.. సోకిందట.
ఇంతకు నాగార్జునకి సోకిన ఆరుదైన వ్యాధి ఏంటి అన్న విషయంలోకి వెళ్తే నాగార్జునకి ధూళి దుమ్ము పడటం లేదట. అది ఒక అలర్జీలా ఆయనను వెంటాడుతోందట. అంతే కాకుండా చర్మంపై దద్దుర్లు దురద కళ్ళు ఎర్రగా అవ్వటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయట. దీంతో చాలా హెల్దీగా ఉండే ఫుడ్ ని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాడట నాగ్..ఎక్కువ వేడి, చాలా చల్లటి వస్తువులు నాగార్జున తీసుకోవడం మానేసినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల నాగార్జున ఇలాంటి వాటిని తింటే ఆయన ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే అని అంటున్నారట వైద్యులు.. ఈ వ్యాధి తగ్గించుకునేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నయం కావడం లేదని సమాచారం. ఇక ఇది విన్న నాగార్జున అభిమానులు ఆయన తొందరగా రికవరీ కావాలని కామెంట్స్ పెడుతున్నారు.